Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి సవతి తల్లి ప్రేమ చూపుతుంది
- టీవీపీఎస్ సభ్యులు సతీష్ గుండపునేని
నవతెలంగాణ-కొత్తగూడెం
తెలంగాణ వ్యాప్తంగా వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతునట్టు చెపుతున్న సింగరేణి సంస్థ వికలాంగుల జీవితాల్లో మాత్రం అంధకారం నింపుతుందని, ఈ ప్రాంత దివ్యాంగులపై సింగరేణి సంస్థ సవతి తల్లి ప్రేమ చూపుతుందని తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల సంఘం (టివిపిఎస్) వ్యవస్థాపక అధ్యక్షులు, విజేఏసి చైర్మన్ సతీష్ గుండపునేని ఆరోపించారు. శుక్రవారం సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ సింగరేణి ప్రాంతాల్లో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు సింగరేణి అధికారులకు విన్నవించినప్పటికీ సమస్యల పరిష్కారిం చకపోవటం విచారకరమన్నారు. సింగరేణి సిఎస్ర్ నిధులలో వికలాంగుల అభివృద్ధికి కచ్చితంగా 5 శాతం నిధులు కేటాయించాలని, సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల్లో వికలాంగులకు అవకాశం కల్పించాలని, కొత్తగూడెం ప్రాంతం నిరక్షరాస్యులైన వికలాంగులకు స్వయం ఉపాధి శిక్షణ కోసం సింగరేణి పాత భవనాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. పలు సమస్యలు పరిష్కరించాలని కోరినప్పటికీ వికలాంగులపై కనీస కనికరం చూపించలేదని ఆరోపించారు. వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు ఆమరణ దీక్షకు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మేడి ప్రవీణ్, ఖాసీం కళా బాబు రమేష్, సునీత, జురుబాబు, పిర్యా, గోవిందు, గోపి, భాస్కర్, రామకృష్ణ, పాల్గొన్నారు.