Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజాపూర్ ఎమ్మెల్యే విక్రమ్ సాహౌ మాడవి
నవతెలంగాణ-దుమ్ముగూడెం
2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని చత్తీస్ఘడ్ రాష్ట్రం బీజపూర్ ఎమ్మెల్యే విక్రమ్ సాహౌ మాడవి అన్నారు. శుక్రవారం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దైవ దర్శనం అనంతరం చర్ల వెళుతూ లక్ష్మీ నగరం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులతో సమావేశం నిర్వహించారు. ముందుగా నాయకులు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీల బలా, బలాలతో పాటు మునుగోడు అసెంబ్లీ ఎన్నికల గురించి అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్ ఉందని కార్యకర్తలు ఎవరూ అధైర్య పడాల్సిన పని లేదన్నారు. ఆయన వెంట బీజాపూర్ జిల్లా పరిషత్ చ్కెర్మన్ సంకల్ప్ కూడియా, వైస్ చైర్మన్ కారం కామేష్, డీసీసీ ప్రెసిడెంట్ లాల్ రాథోడ్‌లతో పాటు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లంక శ్రీనివాసరావు, బైరెడ్డి, సీతారామారావు, పిలకా వెంకట రమణ రెడ్డి, ఆప్పలరెడ్డి, వేముల, శ్రీనివాస్, తోటముల్ల తదితరులు పాల్గొన్నారు.