Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ రూ. 296 కోట్లు
- ఎల్లవేళలా కార్మికులకు అండగా ఉంటాం
- సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంథా నరసింహారావు
నవతెలంగాణ-ఇల్లందు
సింగరేణి కార్మికులకు దీపావళి లాభాల బోనస్ సామాన్యం చెల్లించడానికి జేబీసీసీఐలో చర్చలు సీఐటీయూ కృషి ఫలితమేనని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహారావు అన్నారు. స్థానిక కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. సెప్టెంబర్ నెల 28న రాంచీలో జేబీసిసిఐ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో జాతీయ కార్మిక ఢసంఘాలయిన సిఐటియు, ఏటియుసి, హెచ్ఎంఎస్, బిఎంఎస్ సంఘాల కార్మిక నేతలు పాల్గొన్నారు. కోల్ ఇండియా సింగరేణి యాజమాన్యంతో చర్చలు జరిగాయి. ఈ చర్చలో సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ రూ. 296 కోట్లు ఇవ్వడానికి అంగీకరించింది. జాతీయ కార్మిక సంఘాలు, సిఐటీయు కృషి ఫలితంగా గతేడాది 72,500 ఉన్న బోనస్ ఈ యేడాది రూ.76,500 సాధించామని అన్నారు. గతేడాది కంటే నాలుగు వేలు అదనంగా కార్మికులకు ప్రయోజనం చేకూర్చామని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ ,ఆదిలాబాద్ జిల్లాలో బొగ్గు గనులు ఉన్నాయి. సుమారు 42 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరందరికీ దీపావళి లాభాల బోనస్ అందుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఎల్లవేళలా కార్మికులకు అండగా ఉంటామని సమస్యల సాధనకు కృషి చేస్తానని తెలిపారు. కార్మికులు కూడా పోరాడే సంఘానికి చేయూతనివ్వాలని కోరారు. కార్మికులు అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో సిఐటీయు రాష్ట్ర కమిటీ సభ్యులు కూకట్ల శంకర్, బ్రాంచ్ కార్యదర్శి ఎండి. అబ్బాస్ వీరయ్య తదితరులు పాల్గొన్నారు.