Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోల్ మోడల్‌గా ఎదగాలి
- కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
నవతెలంగాణ-కొత్తగూడెం
విద్యార్థులు చదువుల పట్ల శ్రద్ధ వహించి అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, రోల్ మోడడ్గా ఎదగాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకాంక్షించారు. శుక్రవారం కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని రామవరం ఎస్సీబి నగర్ జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ద్వారా నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబా పూలే చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లాలో 12 మహాత్మా పూలే గురుకులాలున్నాయని, అదననంగా ప్రభుత్వం మరొక గురుకులాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ గురుకులంలో 5,6,7 తరగతులు చదువుతున్న 250 మంది విద్యార్థులకు వసతి కల్పించనున్నట్లు చెప్పారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలంటే తల్లిదండ్రులు ఆసక్తి చూపేవారు కాదని, నేడు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలు ఆహ్లాదకరంగా తయారు కావడంతో సింబల్ ఆఫ్ ఎక్సలెన్సీగా తయారయ్యాయని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. విజ్ఞానానికి మించిన ఆస్థి మరొకటి లేదని, తల్లిదండ్రులు తమ పిల్లలను విద్యావం తులను చేయాలని చెప్పారు. విద్యార్థులు చిన్నతనం నుండే విద్య పట్ల మక్కువ పెంచుకొని మంచి పునాదులు వేసుకోవాలని చెప్పారు. నేడు శాస్త్ర సాంకేతికరంగం ఎంతో అభివృద్ధి చెందిందని, అర్ధంకాని అంశాలను అంతర్జాలం ద్వారా తెలుసుకునే సౌలభ్యం అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి సురేందర్, పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణవేణి, మున్సిపల్ కమిషనర్ నవీన్, తహసిల్దార్ రామ కృష్ణ, యంపిటిసి రుక్ముణి తదితరులు పాల్గొన్నారు.