Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రమాదాలకు నిలయం
నవతెలంగాణ-ఎర్రుపాలెం
గత పది రోజుల పైబడి ఎరతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గుంతలమయంతో అధ్వానంగా మారిన రోడ్డు మార్గంలో ఏర్పడిన గుంతలలో నీళ్లు నిలబడి ప్రధాన రహదారి చేపల చెరువుగా మారింది. ఎర్రుపాలెం మండల పరిధిలోని వివిధ గ్రామాలకు అనుసంధానమైన ప్రధాన రహదారి మార్గం నుండి ప్రయాణించే వాహన చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. మండల పరిధిలోని బనిగండ్ల పాడు వయా బుచ్చిరెడ్డిపాలెం, నరసింహపురం గ్రామాల నుండి తెలంగాణ సరిహద్దు గ్రామాలతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశించే ఈ రోడ్డు మార్గం నుండి విజయవాడకు వెళ్ళవచ్చ, అటువంటి ప్రధానమైన రోడ్డు మార్గం ప్రమాదాలకు నిలయంగా మారిందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేశాన్ని వెళ్ళబుచ్చారు.మధిర ఆర్టీసీ డిపో నుండి బనిగండ్లపాడు, బుచ్చిరెడ్డి పాలెం వయా ఆంధ్రప్రదేశ్లోని మైలవరం వరకు నడిచే పల్లె వెలుగు బస్సులను ఆపాల్సి వస్తుందని ఆర్టీసీ అధికారులు చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు. పేరుకు ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ అయినా, ప్రస్తుతానికి మధిర నియోజక వర్గానికి చైర్మన్గా వ్యవహరిస్తున్న లింగాల కమలరాజు ఎర్రుపాలెం మండలానికి వారానికి మూడు నాలుగు సార్లు వచ్చినా, మండల అభివృద్ధికి నిధులు కేటాయించడంలో చొరవ చూపించడం లేదని మండల ప్రజలు విమర్శిస్తు న్నారు. పరామర్శలు, పలకరింపులకే, ప్రాధాన్యత ను ఇస్తున్నారని ఎన్నోసార్లు ఈ రోడ్డు మార్గం నుండి ప్రయాణం చేసినా, అధ్వానంగా మారిన రోడ్డును పట్టించుకున్న పాపాన పోలేదని ప్రజలు విమర్శిస్తున్నారు .రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్, ఖమ్మం జిల్లా పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు, ఈ రోడ్డు లో ప్రయాణిం చినా అద్వానంగా ఉన్న రోడ్డుకు మరమ్మతుల కోసం నిధులు కేటాయించలేదని గ్రామస్తులు తెలిపారు. మధిర శాసన సభ్యులు సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క మండలంలోని ప్రధాన రహదారులు అధ్వానంగా తయారైన మరమ్మతులకు నిధులు కేటాయించి బాగు చేయించాలనే ఆలోచన లేదని, ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు, వాహన చోదకులు విమర్శిస్తున్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పార్లమెంటు సభ్యులు నామ నాగేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, స్థానిక శాసన సభ్యులు మల్లు భట్టి విక్రమార్క, చొరవ చూపించి అద్వానంగా ఉన్న రోడ్డు కు నిధులు కేటాయించి తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలని, ప్రమాదాలను నిలువరించాలని, ప్రజలు, వాహన ప్రయాణికులు కోరుతున్నారు.