Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆందోళనలో రైతులు
నవతెలంగాణ - బోనకల్
ఎంతో వేపుగా పెరుగుతున్న మిర్చి పంట ఒక్కసారిగా మాడిపోడుతూ ఆకులు రాలిపోతుం డటంతో అన్నదాత అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోనే రామాపురం గ్రామానికి చెందిన మేకల ఉప్పలయ్య తనకు చెందిన ఎకరం ఐదు గంటల పొలంలో ఈ ఏడాది మిర్చి పంటను సాగు చేశాడు. పంటకు సుమారు లక్ష యాభై వేల రూపాయలు నేటి వరకు పెట్టుబడి పెట్టాడు. అయితే మూడు రోజుల క్రితం మిర్చి పంటకు దోమ, పురుగు ఆశించటంతో బ్లోయర్, సూపర్ కాన్ఫడర్ మందులను పిసికారి చేశాడు. దీంతో మరుసటి రోజు నుంచి మిర్చి పంట మాడిపోతూ ఆకు రాలిపోతుంది. మిర్చి పంటలో ఉన్న గడ్డి కూడా ఎండిపోతుంది. పురుగుకు, దోమకు మందు పిచికారి చేస్తే గడ్డి ఎండిపోతుండటంతో రైతులో అనుమానాలు రేకెత్తించాయి. అయితే అంతకుముందు మిర్చి తోటలోనే రమ్ములో నీరు నిల్వ ఉంచినట్లు తెలిపారు. ఆ నీటిలో గడ్డి మందుతో పాటు పంట నాశనానికి ఏదో మందు గుర్తి తెలియని వ్యక్తులు కలిపి ఉండవచ్చునని బాధిత రైతు అనుమానం వ్యక్తం చేశాడు. ఆ నీటినే తాను వినియోగించినట్లు తెలిపాడు. విషయాన్ని కంపెనీ ప్రతినిధులకు తెలిపినట్లు తెలిపాడు. కంపెనీ ప్రతినిధులు బుధవారం పంటను పరిశీలించి విత్తనాలు లోపం కాదని, ఇదే విత్తనం ఈ పంట పొలం పక్కనే ఏపుగా ఉందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. తన పంట ఏపుగా ఉండటంతో ఓర్వలేకనే గుర్తు తెలియని వ్యక్తులు రమ్ము లో ఉన్న నీటిలో కలిపి ఉండవచ్చునని దాని ప్రభావంతోనే మిర్చి పంట దెబ్బతిని పోతుందని బాధిత రైతు అనుమానం వ్యక్తం చేశాడు. తాను వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అప్పుచేసి లక్ష యాభై వేల రూపాయల పెట్టిన పెట్టుబడి నేలపాలైందని రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి తనకు న్యాయం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను కోరుతున్నాడు.
గడ్డి మందు వల్లే పంట నష్టం
మండల వ్యవసాయ శాఖ అధికారి శరత్ బాబు
గడ్డి మందు కొట్టడం వలన మిర్చి పంట మాడిపోయి ఆకు రాలిపోతుందని మండల వ్యవసాయ శాఖ అధికారి అబ్బూరి శరత్ బాబు అన్నారు. దెబ్బతిన్న మిర్చి పంటను శుక్రవారం వ్యవసాయ విస్తానధికారి బండి శ్రీకాంత్తో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గడ్డి మందు దెబ్బతిన్నదని స్పష్టం చేశారు. మండల వ్యవసాయ శాఖ నిర్ధారణతో బాధిత రైతు అనుమానం దీంతో నిర్ధారణ అయింది.