Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాకు చెప్పి హక్కుకు అడ్డుపడవద్దు
- పేదలు భయాందోళనకు గురికావద్దు
- పోడు సర్వేను పరిశీలించిన సీపీఐ(ఎం)
నవతెలంగాణ-కారేపల్లి
రికార్డులు సమర్పించలేదని సాకుతో పోడుకు హక్కును నిరాకరించవద్దని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, వ్యవసాయకార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ అన్నారు. శుక్రవారం కారేపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో సీపీఐ(ఎం) ప్రజాప్రతినిధులు పోడు సర్వేను పరిశీలించారు. ఈసందర్బంగా వారు మాట్లాడు తూ పోడు చేసుకుంటున్న గిరిజన, గిరిజనేతరు లకు హక్కు కల్పించాలని చట్టం చెప్పుతుంద న్నారు. గిరిజనేతరులకు మూడు తరాలు సాగు చేస్తున్నట్లు ఆధారాలు చూపా లంటూ కొందరు ప్రచారం చేస్తున్నార న్నారు. పోడు సాగు ఆధారాలు ప్రభుత్వ వద్దే లేనప్పుడు పేదల వద్ద ఎలా ఉంటుందని ప్రశ్నించారు. హక్కు పత్రాలను గ్రామ సభ ఏర్పాటు చేసిన 70 ఏండ్లు నిండిన వారి అభిప్రాయంతో తీర్మానం చేసి హక్కు కల్పించాలన్నారు. గిరిజనేతరులు ఎలాంటి భయాందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. కారేపల్లి రెవిన్యూ పరిధిలో అధిరారులు పోడు క్లయిమ్లపై సంతకాలు చేయటంలేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. సర్వే చేసినట్లు దరఖాస్తుదారుడికి క్లయిమ్ ఫామ్ పై సంతకం చేసి ఇవ్వాలన్నారు. పోడు హక్కుకోసం సీపీఐ(ఎం), ప్రజాసంఘాల నిరంతరం పోరాటం తో ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు సర్వేకు ఆదేశాలిచ్చారన్నారు. అధికారులు కొర్రీలు పెట్టి పేదలను భయభ్రంతులకు గురిచేయవద్దన్నారు. అధికారుల ఇబ్బందులు పెట్టినా పోడులోనే చావోరేవో తేల్చుకున్న చరిత్ర కారేపల్లికి ఉందన్నారు. పేదలకు హక్కు కల్పించేవరకు సీపీఐ(ఎం) అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు కే.నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కే.నరేంద్ర, నాయకులు వజ్జా రామారావు, పాసిన్ని నాగేశ్వరరావు చరప వీరస్వామి, తురక రాంబాబు, చెవుల రవి, పాలిక లింగయ్య, చెవుల లక్ష్మినారాయణ, లింగమ్మ, బుగ్గ రమేష్, ముక్కపాటి మోహన్రావు, కుమ్మరి నాగేశ్వరరావు, పందుల సోమయ్య తదితరులు పాల్గొన్నారు.