Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సత్తుపల్లిరూరల్ : వరిపైరులో దోమపోటు, కంకినపల్లి ఉధృతిని అరికట్టడానికి సస్యరక్షణా చర్యలు పాటించాలని మండల వ్యవసాయాధికారి వై.శ్రీనివాసరా వు సూచించారు. శుక్రవారం సత్తుపల్లి మండలం కిష్టాపురం, తుంబూరు గ్రామాలలోని వరిపైర్లను పరిశీలించిన అధికారి శ్రీనివాసరావు రైతులతో మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. ప్రస్తుత వరిపైరు పోట్టు దశ నుంచి ఈనిక దశ వరకూ ఉన్నదన్నారు. ఈ దశలో వర్షపాతం, వాతావరణంలో ఉక్కపోత, ఎక్కువ నత్రజని వినియోగం తదితర కారణాలతో దోమపోటు, కంకినపల్లి ఉధృతి పెరుగుతుందన్నారు. దోమపోటును నివారించేందుకు పైమైట్రోజన్ను 126 గ్రాములు లేదా ట్రైప్లూమోడోపైరిమ్ను 96ఎంఎల్ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలన్నారు. కంకినల్లి నివారణనకు స్పైరోమెసిఫిన్ 200 ఎంఎల్ ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలని సూచించారు. కార్యక్రమంలో రైతులు కృష్ణ, గాంధీ పాల్గొన్నారు.