Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చింతకాని : సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని డిఎల్పిఓ పుల్లారావు ప్రజలకు సూచించారు. శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని రామకృష్ణాపు రం గ్రామంలో డిఎల్పిఓ పర్యటించారు ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమం విధిగా నిర్వహించాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కన్నబోయిన కుటుంబరావు, ఎంపీఓ మల్లెల రవీంద్ర ప్రసాద్ పంచాయతీ కార్యదర్శి సురేష్ ఆశా అంగన్వాడి కార్యకర్తలు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.