Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుండె మెగా వైద్యశిబిరంలో వైద్యులు జంజీరాల
నవతెలంగాణ- ఖమ్మం
'మీ హృదయం మీ చేతుల్లో నే' పదిలంగా ఉండే విధంగా వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని ప్రసూన ఆసుపత్రి కార్డియాలజిస్టు వైద్యులు శశివర్థన్ జంజీరాల, ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ వైద్యులు బాలభాస్కర్రెడ్డి అన్నారు. శుక్రవారం ఖమ్మంలోని ప్రసూన ఆసుపత్రి కార్డియాక్, సూపర్ స్పెషాలిటీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం వారు మాట్లాడుతూ శుక్రవారం నుంచి 16 వరకు మూడు రోజుల పాటు కార్డియాక్ స్క్రీనింగ్ ప్యాకేజీని రూ.3,700 నుంచి తగ్గించి కేవలం రూ. 999లకే బిపి, షుగర్, క్రియాటినైన్, 2డిఎకో, లిపిడ్ ప్రోపైల్, ఈసిజి పరీక్షలను నిర్వహించి వైద్య సేవలను అందిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని ఖమ్మం ఉమ్మడి జిల్లాలోని గుండె సంబంధిత వ్యాధి రోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ వైద్య శిబిరంలో భాగంగా ఉచిత డాక్టర్ కన్సల్టెషన్ను కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.