Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చింతకాని:తొలిమెట్టుపై ఉపాధ్యా యు లందరూ పట్టు సాధించాల ని, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణం గా విద్యాబోధన కొనసాగించాలని మండల విద్యాశాఖ అధికారి మోదుగు శ్యాంసన్ అన్నారు. చింతకాని ఉన్నత పాఠశాలలో ప్రాథమిక పాఠశాలలో ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఆర్పీలకు సిఆర్పిలకు జరిగిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు యొక్క కనీస అభ్యసన సామర్థ్యాలతో పాటు తరగతి వారి సామర్థ్యాలను కూడా సాధించేలా పాఠశాలలో ఉపాధ్యాయుడు సంసిద్ధుడై వెళ్లాలని అందుకు అనుగుణంగా ఒక ప్రణాళిక బద్ధంగా ప్రతి ఒక్కరు కూడా సబ్జెక్టులు పరంగా అవగాహన కలిగి ఉండాలని కోరారు. విద్యార్థి యొక్క స్థాయికి తగిన విధంగా ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ సంసిద్ధులుగా ఉండాలని అందుకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవాలని శిక్షణ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల నోడల్ అధికారి శ్రీనివాసరావు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కె.నరసింహారావు, పోటు శ్రీనివాసరావు, శోభారాణి వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు సిఆర్పిలు పాల్గొన్నారు.