Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు
నవతెలంగాణ-చింతకాని
దళితుల దారిద్య్ర రేఖను మార్చేందుకు దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ నవయుగ అంబేద్కర్ అని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు.చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో దళిత బంధు ద్వారా మంజూరైన టైర్ రీ బటనింగ్ యూనిట్లను శుక్రవారం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆలస్యం నాగమణి ఎంపీటీసీ మనుకుంట్ల నాగరత్నం సొసైటీ చైర్మన్ శేషగిరిరావు డైరెక్టర్ వంకాయలపాటి వెంకట లచ్చయ్య టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.