Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
ముదిగొండ గ్రామానికి చెందిన సిపిఐ(ఎం) సీనియర్ నేత పుచ్చకాయల చిన్నయలమంద (62) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేష్, మండల పార్టీ కార్యదర్శి బట్టు పురుషోత్తం, నాయకులు రాయల వెంకటేశ్వర్లు, వాసిరెడ్డి వరప్రసాద్, పయ్యావుల ప్రభావతి, పయ్యావుల రామనాథం, నెమిలి సైదులు, మందరపు వెంకన్న, మంకెన దామోదర్, పుచ్చకాయల లక్ష్మయ్య, మర్లపాటి వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావులు యలమంద మృతదేహాన్ని సందర్శించి పార్టీ పతాకాన్ని కప్పి ఘనంగా నివాళులర్పించారు. యలమంద తను పుట్టినప్పటి నుండి 40 ఏళ్లుగా సిపిఐ (ఎం)లో ఉంటూ పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు. పార్టీ పట్ల వినయ విధేయతలు చూపుతూ పార్టీ అభ్యున్నతకు కృషి చేసి, ఎర్రజెండా నీడన ప్రజలకు అండగా నిలిచిన సిపిఐ (ఎం) నాయకులు అమరజీవి మాజీ ఎంపీపీ పుచ్చకాయల వెంకటేశ్వర్లు సోదరుడు యలమంద పుచ్చకాయల వెంకటేశ్వర్లు వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని యలమంద పార్టీలోనే కొనసాగుతూ ప్రజల మన్నలను పొందారు. యలమంద అనారోగ్యానికి గురై మృతి చెందటం బాధాకరం. కుటుంబ సభ్యులు,యలమంద అభిమానులు,పార్టీ కార్యకర్తలు కన్నీళ్ళతో తన అభిమాన నాయకుని కళ్ళారా చూసుకున్నారు. ముదిగొండ, వెంకటాపురం, రాఘవాపురం గ్రామాలలో మంచితనంతో అందరి మనుషుల్లో సుస్థిరస్థానాన్ని సంపాదించుకున్న యలమంద అంతిమయాత్రలో ఎర్రజెండాలతో, భారీ సంఖ్యలో మహిళలు, పార్టీ కార్యకర్తలు, యువకులు నాయకులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు పాల్గొని, కడసార ప్రజా అభిమాన నాయకులు యలమందకు కన్నీటి వీడ్కోలు పలికారు. యలమందకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. యలమంద మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని సిపిఐ (ఎం) గ్రామ, మండల కమిటీ తెలిపింది. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం) నాయకులు మంకెన శేఖర్, కందుల భాస్కరరావు, మందరపు పద్మ, వేల్పుల భద్రయ్య, కత్తుల లక్ష్మీనరసయ్య, బట్టు రాజు, మెట్టెల సతీష్, యండ్రాతి సీతయ్య, ఇరుకు నాగేశ్వరరావు, పుచ్చకాయల నాసరయ్య, రామకృష్ణ, పొనుకుల సుధాకర్, రవిశేఖర్, పురిమెట్ల సాయిరాం, కాంచని లింగయ్య, యలమంద కుటుంబసభ్యులు పాల్గొన్నారు.