Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ ఆధ్వర్యంలో సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు ధర్నా
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న ఏరియర్స్ తక్షణమే చెల్లించాలని, అప్డేట్ అయినా సీఎంపీఎఫ్ పాస్ బుక్స్లను వెంటనే కార్మికులకు అందజేయాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి పర్సనల్ మేనేజర్ వైవి ఎల్.వరప్రసాద్‌కి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఈ ధర్నాను ఉద్దేశించి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు యర్రగాని కృష్ణయ్య మాట్లాడుతూ సింగరేణిలో గత 17 నెలల నుండి పెరిగిన డీఏ బాపతు ఏరియర్స్‌ను కాంట్రాక్ట్ కార్మికులకు చెల్లించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వ్యవహరిస్తుందన్నారు. తక్షణమే దీపావళి పండుగకు ముందుగా ఏరియర్స్ డబ్బులను చెల్లించాలని డిమాండ్ చేశారు. గత నెలలో 18 రోజులపాటు జరిగిన సమ్మె సందర్భంగా ఆయన ఒప్పందంలోని అంశాలకు తక్షణమే సర్క్యులర్స్‌ను విడుదల చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు సూరం ఐలయ్య, జి.శ్యామ్ కుమార్, ఎం.చంద్రశేఖర్, సిఐటియు జిల్లా నాయకులు భూక్య రమేష్, కొత్తగూడెం పట్టణ కార్యదర్శి డి.వీరన్న, నాయకులు ఏ.ప్రభాకర్, సైదమ్మ, సక్రాం, పద్మ, సుభద్ర, నాగమణి, సుగుణ, నరసింహ, జి.శ్రీను పాల్గొన్నారు.