Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆటోట్రాలీ డ్రైవర్స్ వర్కర్స్ అండ్ ఓనర్స్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక
నవతెలంగాణ-కొత్తగూడెం
ఆటో డ్రైవర్స్‌ను చాలాన్ పేరుతో పోలీస్‌లు, ప్రభుత్వ అధికారుల వేదింపులు గురిచేస్తున్నారని, ఇది మానుకోవాలని, అర్హులైన పేద ఆటో డ్రైవర్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, పెరిగిన పెట్రోల్, డిజిల్ ధరలు తగ్గించాలని సీఐటీయూ పట్టణ కార్యదర్శి డి.వీరన్న, జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక మంచికంటి భవన్లో సీఐటీయూ ఆటో యూనియన్స్ మహాసభ జరిగింది. ఈ మహా సభలో వారు మాట్లాడారు. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారంకోసం ఉమ్మడిగా పోరాటాలు చేయాలని పిలుపు నిచ్చారు.
నూతన కమిటీ ఎన్నిక ఆటో-ట్రాలీ డ్రైవర్స్ వర్కర్స్ అండ్ ఓనర్స్ యూనియన్ మహా సభ సందర్భంగా నూతన కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్షులుగా శ్యామ్, కార్యదర్శిగా వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. వీరితో పాటు 15మందిని కమిటీ ఎన్నుకుంది. ఈ కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ నాయకులు లిక్కి బాలరాజు, రింగు వెంకటయ్య, రాంబాబు, సయ్యద్, చంద్రమౌళి, నర్సింహా, శివ, మల్సూర్ తదితరులు పాల్గొన్నారు.