Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిలా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-ములకపల్లి
పోడు భూముల సర్వేలో ప్రతి ఎకరాన్ని సర్వే చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. మంగళవారం ములకలపల్లి మండలం కొమ్ముగూడెం పోడు భూముల సర్వేను ఆయన పరిశీలించి మాట్లాడుతూ పోడు భూముల సర్వే నిష్పక్షపాతంగా ప్రతి ఒక్క ఎకరాన్ని సర్వే చేయాలని, అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు సాగుదారులు అందరి భూములను సర్వే చేయాలని కోరారు. మండలంలో ఇప్పటికే సర్వే ఆలస్యం అయ్యిందని, సర్వే పనులు వేగంగా చేయాలని డిమాండ్ చేశారు. ఆయిన వెంట పార్టీ మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, రావుజా డి.వెంకటేశ్వర్లు, జగ్గు, పులి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.