Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే.రమేష్
నవతెలంగాణ-పాల్వంచ
రాష్ట్రంలో పని చేస్తున్న అన్ని రకాల హమాలీలకు వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు చేయాలని, అందుకు అనుగుణంగా నిధులను మంజూరు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎ.జె.రమేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాల్వంచలో సీఐటీయూ కార్యాలయంలో భద్రాచలం రోడ్ హమాలీ యూనియన్ మహాసభ గట్టయ్య, రాములు అధ్యక్షతన మంగళవారం జరిగింది. మహాసభకి ముఖ్య అతిథిగా హాజరైన ఎ.జె.రమేష్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో హమాలీ పనిని కార్మికులు చేస్తున్నారని పని చేసే క్రమంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పనిలో భద్రత లేకపోవడం, ప్రమాదాలు జరగటం, వేధింపులు గురికావడం, అడ్డాలు లేకపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారన్నారు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిన వేతన ఒప్పందాలు ఎగవేయటానికి, వాయిదా వేయటానికి యాజమాన్యాలు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయన్నారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు భారం ఒకవైపు, పని భారం మరోవైపు కార్మికులు ఎదుర్కొంటున్నారన్నారు. పని చేసినంత కాలం వేతనం తప్ప పనిలో నుంచి దిగేటప్పుడు ఎటువంటి పరిహారం కానీ, పెన్షన్ సౌకర్యం కానీ అమలు కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కార్మికులకు అందించాలని డిమాండ్ చేశారు. ఇల్లు, ఇళ్ల స్థలాలు లేకపోవడం, నివాస ప్రాంతాలలో పారిశుధ్యం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు.
సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు దొడ్డా రవి కుమార్ మాట్లాడుతూ పాల్వంచ పట్టణంలో హమాలిలు సమస్యలపై రాజీ లేని పోరాటాలు చేశామన్నారు. వేతన ఒప్పందాలు సందర్భంలో కార్మి కులకు న్యాయం చేసేట్లు వ్యహరిస్తున్నా మన్నారు. కార్మికులకు వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు కోసం దీర్ఘ కాలిక పోరాటాలు చేయాలని పిలుపు నిచ్చారు. మహ సభలో ఈ కాలంలో మరణించిన కార్మికులకు సంతా పం ప్రకటించారు. మహాసభలో హమాలీ యూని యన్ నాయకులు సంతోష్, ఓదెలు, నరసింహారావు, నాగుల్ మీరా, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.