Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరకట్ట ఎత్తు పెంచాలి, లీకులు అరికట్టాలి
- పోలవరం పునరావాస ప్యాకేజీ ఇవ్వాలి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం పట్టణ ప్రాంతంలో ముంపుముకు గురవుతున్న కాలనీల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని విడనాడాలని, కరకట్ట ఎత్తు పెంచి స్లూసులు అరికట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు, భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి మచ్చా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. మర్లపాటి రేణుక అధ్యక్షతన మంగళవారం పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సమావేశం, కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మచ్చా మాట్లాడుతూ భద్రాచలం పట్టణంలో ముంపుకు గురవుతున్న కాలనీలలో ఇటీవల అధికారులు సర్వేల పేరుతో హడావిడి చేసి ఇప్పుడు మిన్నక్కున్నారని అన్నారు. వరదలు వచ్చినప్పుడు లేదా ఎన్నికలు వచ్చినప్పుడు హడావిడి చేయకుండా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ప్రభుత్వ అధికారులు కాలనీలకు వచ్చి సర్వేలు చేసారు, తమ కుటుంబాల వివరాలు చెప్పాలని ఒత్తిడి చేయడం దీనితో పట్టణంలో ఉన్న అయ్యప్ప కాలనీ, అశోక్ నగర్ కొత్త కాలనీ, ఏఎంసీ కాలనీ, సుభాష్ నగర్, శాంతినగర్, శిల్పి నగర్ వంటి కాలనీలలో అధికారులు చేసిన హడావిడికి ప్రజలు వ్యతిరేకించినారు. అధికారులు ఈ సమస్యపై ఎటు తేల్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదన్నారు. పోలవరం బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలం పట్టణంలో అధికారులు ముంపుకు గురవుతున్న కాలనీలలో గ్రామ జనరల్ బాడీలు పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని అన్నారు. దీంతో పాటు ప్రజలకు వాస్తవాలు వివరించాలని అన్నారు. ఈ కాలనిల నుండి తరలిస్తే ఎక్కడికి తీసుకువెళ్తారు? ఎక్కడ ఇళ్ల నిర్మాణం చేస్తారు? ఇటువంటి ఆర్థిక సహకారం చేస్తారు చెప్పాలని అన్నారు. సమావేశంలో పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.బి నర్సారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు సున్నం గంగా పట్టణ, పట్టణ కార్యదర్శి వర్గం సభ్యులు బి.వెంకటరెడ్డి, బండారు శరత్ బాబు, షంతోష్, లీలావతి, కమిటీ సభ్యులు డి.సీతాలక్ష్మి, బి.కుసుమ, యు.జ్యోతి, జి.జ్యోతి, నాగరాజు, ఏ.రత్నం, కోరాడ శ్రీనివాస్, కుంజ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.