Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చట్టానికి లోబడి వలస ఆదివాసులకు పట్టాలు ఇవ్వాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-మణుగూరు
జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయని, డెంగ్యూ జ్వరాల సంఖ్య పెరుగుతుందని విషజ్వరాల నివారణకు చర్యలు చేపట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. మంగళవారం స్థానిక శ్రామిక భవనంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ అధిక వర్షాల కారణంగా పారిశుధ్య పనులు సరిగ్గా నిర్వహించని కారణంగా పల్లెలు పట్టణాలు తేడా లేకుండా విషజ్వరాల భారీన పడి ప్రజలు మరణిస్తున్నా రన్నారు. యుద్ద ప్రాతిపదికన గ్రామాలల్లో జ్వరాల సర్వేలు నిర్వహించాలని, వైద్య శిబిరాలు నిర్వహించా లన్నారు. భ్లీచింగ్ చల్లించాలన్నారు. ఫాగింగ్ నిర్వహి ంచి దోమలను అరికట్టాలన్నారు. మణుగూరు ప్రభు త్వ ఏరియా వంద పడకల ఆసుపత్రిలో డెంగ్యూ పరీక్షలు, రక్తకణాల సంఖ్య పరీక్షలు నిర్వహించా లన్నారు. సాగులో ఉన్నా పోడు భూములకు సర్వే నిర్వహించా లన్నారు. అటవీహక్కుల చట్టాలకు లోబడి దరఖాస్తు చేసుకున్న ప్రతి వారికి సర్వే నిర్వహించాలన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. 2005కి ముందు సాగులో ఉన్నా వలస ఆదివాసులు చట్టానికి లోబడి సర్వే నిర్వహించి పోడు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి కొడిశాల రాములు, టివిఎంవి ప్రసాద్, ఉప్పుతల నర్సింహారావు, తోట పద్మ, వైనాల నాగలక్ష్మీ, మడి నర్సింహారావు, పిట్టల నాగమణి, లెనిన్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.