Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండవ రోజు విజయవంతంగా పోటీలు
- పలు క్రీడలను ప్రారంభించిన ఏపీఓ జనరల్, ఆర్సీఓ డేవిడ్ రాజు
- పర్యవేక్షించిన గిరిజన గురుకులం సొసైటీ ఉన్నతాధికారులు
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం గిరిజన గురుకుల విద్యా సంస్థ ప్రాంగణంలో గిరిజన గురుకుల జోనల్ లెవెల్ గేమ్స్, స్పోర్ట్స్ మీట్లో భాగంగా మంగళవారం జరిగిన వివిధ క్రీడా పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఉభయ ఖమ్మం నల్గొండ, జిల్లాల నుంచి 600 మంది బాలికలు ఈ క్రీడా పోటీల్లో పాల్గొంటున్న విషయం విధితమే. ఆర్చరీ, క్యారమ్స్, కబడ్డీ, వాలీబాల్, కోకో, టెన్నికాయిట్, హాకీ, రెజ్లింగ్, బాల్ బ్యాట్మెంటన్, బాక్సింగ్, హ్యాండ్ బాల్ తదితర 13 క్రీడాంశాలతో పాటు అథ్లెటిక్స్ పోటీలు కూడా నిర్వహించారు. రెండవ రోజు మంగళవారం జరిగిన వివిధ పోటీల్లో లాంగ్ జంప్ అండర్ 14 విభాగంలో పి.ఇందు (భద్రాచలం) ప్రథమ స్థానం, సిహెచ్ సవిత, (కొత్తగూడెం) ద్వితీయ స్థానం, కే.నందు (కొండమల్లేపల్లి) తృతీయ స్థానం, లాంగ్ జంప్ అండర్ 17 విభాగంలో టి.శ్రీ తేజ (భద్రాచలం) ప్రథమ స్థానం, ఎస్.దీప్తి (భద్రాచలం) ద్వితీయ స్థానం, బి.ప్రతిభా శ్రీ (సుదిమల్ల) తృతీయ స్థానం సాధించారు. లాంగ్ జంప్ అండర్-19 విభాగంలో ఎస్.సౌభాగ్య (భద్రాచలం) ప్రథమ స్థానం, కే.సౌజన్య (సుదిమల్ల) ద్వితీయ స్థానం, వి.ప్రసన్న శ్రీ (భద్రాచలం)తృతీయ స్థానం పొందారు. హై జంప్ అండర్ 14 విభాగంలో పి.ఇందు (భద్రాచలం) ప్రథమ స్థానం, కే.నందు (కొండమల్లేపల్లి) ద్వితీయ స్థానం, కే జోష్ణవి, (భద్రాచలం) తృతీయ స్థానం సాధించారు. హై జంప్ అండర్ 17 విభాగంలో టి.శ్రీ తేజ, (భద్రాచలం) ప్రథమ స్థానం, పి.నాగజ్యోతి (మిర్యాలగూడ) ద్వితీయ స్థానం, జి.ప్రవీణ (సుదిమల్ల) తృతీయ స్థానం పొందారు. హై జంప్ అండర్ 19 విభాగంలో కే.సౌజన్య (సుదిమల్ల) ప్రథమ స్థానం, ఎన్.మౌనిక, (తుంగతుర్తి) ద్వితీయ స్థానం, కే.స్రవంతి (భద్రాచలం) తృతీయ స్థానం పొందారు. చెస్ అండర్ 14 విభాగంలో ఇ.విష్ణువర్ధిని (మణుగూరు) ప్రథమ స్థానం, వి.ఇందు (తుంగతుర్తి) ద్వితీయ స్థానం పొందారు. చెస్ అండర్ 17 విభాగంలో డి.సరిత (మణుగూరు) ప్రథమ స్థానం, ఎం.హన్సిక (మిర్యాలగూడ) ద్వితీయ స్థానం సాధించారు. చెస్ అండర్ 19 విభాగంలో బి.శృతి (అంకంపాలెం) ప్రథమ స్థానం, ఎస్ దుర్గా (కొత్తగూడెం) ద్వితీయ స్థానం పొందారు. షాట్ పుట్ అండర్ 14 విభాగంలో పి ఇందు (భద్రాచలం )ప్రథమ స్థానం, పి తులసి (సుదిమల్ల) ద్వితీయ స్థానం, జె సాత్విక (అన్నపురెడ్డిపల్లి) తృతీయ స్థానం పొందారు. షాట్ పోర్ట్ అండర్ 17 విభాగంలో టి.శ్రీ తేజ (భద్రాచలం) ప్రథమ స్థానం, కే శ్రావణి (కొండమల్లేపల్లి) ద్వితీయ స్థానం, పి.సుభద్ర, (సుదిమల్ల) తృతీయ స్థానం పొందారు. షాట్ పోర్ట్ అండర్ 19 విభాగంలో కే.పల్లవి (సుదిమల్ల) ప్రథమ స్థానం, కే.వినీల (అంకంపాలెం) ద్వితీయ స్థానం, ఎస్.శరణ్య (అంకంపాలెం) తృతీయ స్థానం పొందారు. డిస్కస్ త్రో అండర్ 14 విభాగంలో డి.సింధు (తుంగతుర్తి) ప్రథమ స్థానం, జి శ్రీదేవి (తుంగతుర్తి )ద్వితీయ స్థానం, సిహెచ్ సబిత (కొత్తగూడెం) తృతీయ స్థానం సాధించారు. డిస్కస్ త్రో అండర్ 17 విభాగంలో పి సుభద్ర (సుదిమల్ల )ప్రథమ స్థానం, పి శ్రీ తేజ (భద్రాచలం) ద్వితీయ స్థానం, పి స్వర్ణలత (మణుగూరు) తృతీయ స్థానం పొందారు. డిస్కస్ త్రో అండర్ 19 విభాగంలో కే వినీల (అంకంపాలెం) ప్రథమ స్థానం, ఎస్ శరణ్య (అంకంపాలెం) ద్వితీయ స్థానం, పి.భద్రమ్మ (కొత్తగూడెం) తృతీయ స్థానం సాధించారు. అథ్లెటిక్స్ 100 మీటర్స్ పరుగు పందెం అండర్ 14 విభాగంలో నాగచైతన్య (వైరా) ప్రథమ స్థానం, సిహెచ్ సిహెచ్ సాహితీ (కొత్తగూడెం ) ద్వితీయ స్థానం, ఆర్ అంజలి (దేవరకొండ) తృతీయ స్థానం సాధించారు. 100 మీటర్ల పరుగు పందెం అండర్ 17 విభాగంలో టి.శ్రీ తేజ (భద్రాచలం) ప్రథమ స్థానం, బి ప్రతిభ శ్రీ (సుదిమల్ల) ద్వితీయ స్థానం, జి.ప్రవీణ (సుదిమల్ల) తృతీయ స్థానం పొందారు. 100 మీటర్ల పరుగు పందెం అండర్ 19 విభాగంలో ఎం.కోసమ్మ (అంకంపాలెం) ప్రథమ స్థానం, ఎం.టాబు (అంకంపాలెం) ద్వితీయ స్థానం, ఆర్ కళావ తి (దామరచర్ల) తృతీయ స్థానం పొందారు.
క్రీడలను పర్యవేక్షించిన ఐటీడీఏ ఏపీవో జనరల్, ఆర్సీఓ డేవిడ్ రాజు
భద్రాచలం గిరిజన గురుకుల కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఖమ్మం, నల్గొండ జోనల్ క్రీడలను భద్రాచలం ఐటీడీఏ పీఓ జనరల్, ఇంచార్జ్ ఆర్సీఓ డేవిడ్ రాజు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పలు క్రీడలను ప్రారం భించారు. అందుతున్న సౌకర్యాలు గురించి బాలికల ను అడిగి తెలుసుకున్నారు. క్రీడల విజయవంతం కోసం కష్టపడుతున్న నిర్వాహకులను ఆయన అభినందించారు. బాలికలు క్రీడలో రాణించి మరింత నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.
జోనల్ మీట్‌ను పరిశీలించిన గిరిజన గురుకులం సొసైటీ ఉన్నతాధికారులు
గిరిజన గురుకుల జోనల్ క్రీడలను తెలంగాణ గిరిజన గురుకుల సొసైటీ ఉన్నతాధికారులు ఓఎస్డీ జగదీశ్ రెడ్డి, డిప్యూటీ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి మంగళవారం భద్రాచలం గిరిజన గురుకులం విద్యా ప్రాంగణానికి చేరుకొని పరిశీలించారు. ఈ సందర్భంగా జోనల్ మీట్‌కు సంబంధించిన పలు వివరాలను కళాశాల ప్రిన్సిపాల్ ఎం.దేవదాసు వారికి వివరించారు.
ఈ సందర్భంగా పలు క్రీడలను వారు ప్రారంభించారు. జోనల్ మీట్‌ను పకడ్బందీగా నిర్వహించాలని ప్రిన్సిపాల్‌ను సూచించారు. ఈ కార్యక్రమంలో మణుగూరు గిరిజన గురుకులం కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి, క్రీడల కోఆర్డినేటర్ మాధవి తదితరులు పాల్గొన్నారు.