Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి చండ్ర నరేంద్ర కుమార్
నవతెలంగాణ-జూలూరుపాడు
అధిక వర్షాలతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని, నష్టపోయిన రైతులకు పరిహారం రూ.50వేలు అందించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి చండ్ర నరేంద కుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని గాంధీనగర్, గంగారం తండా, రామకృష్ణాపురం, తదితర గ్రామాల్లో అధిక వర్షాలతో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించి, మాట్లాడారు. ఈ ఖరీఫ్ సీజన్లో కురిసిన భారీ వర్షాలు కారణంగా భద్రాద్రి జిల్లాలో పత్తి పంట దారుణంగా దెబ్బ తిన్నదని, వేలాది ఎకరాల్లో కనీసం ఎకరానికి రెండు మూడు క్వింటాల్ దిగుబడి కూడా వచ్చే అవకాశం లేదన్నారు. అధిక వర్షాలు వల్ల పూత, పిందె రాలిపోవడం మొదటి కాపు కాయలు నల్లబడి పూర్తిగా దెబ్బతిని పోవటం వల్ల రైతులు అయోమయంలో పడ్డారన్నారు. మండల వ్యాప్తంగా 17వేల ఎకరాల్లో పత్తి పంట రైతులు సాగు చేస్తున్నారన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గ్రామాల వారీగా సర్వే నిర్వహించి, ఎకరానికి రూ.50 వేల నష్ట పరిహారం చెల్లించాన్నారు. కౌలు రైతులకు కౌలు కూడా ప్రభుత్వమే భరించాలని, లేనిపక్షంలో రైతుల పక్షాన నిలబడి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. తెలంగాణలో భవిష్యత్తులో రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు గుండె పిన్ని వెంకటేశ్వర్లు, భూక్యా శంకర్, బానోత్ హర్య, మలోత్ గోపాల్, భూక్య ధర్మ, హనుమ, మంగ్య తదితరులు పాల్గొన్నారు.