Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డు పనుల శంకుస్థాపనలో ఎమ్మెల్యే
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం నియోజక వర్గంలో రాజకీయా లకతీతంగా అభివృద్ధి చేయడంమే నా లక్ష్యమని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం మున్సిపల్ 10వ వార్డులో రోడ్డు పనుల శంకుస్థాపన చేశారు. 14 ఫైనాన్స్ నిధులతో రూ.8.19 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కౌన్సిలర్ మునిగడప పద్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా, ప్రజల సహకారంతో, మున్సిపాలిటీని అభివృద్ధి చేయడమే లక్ష్యంతో పని చేస్తున్నానన్నారు. అనంతరం వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ వార్డులో నెలకొన్న కిన్నెరసాని మంచినీటి అదనపు పైపులైన్ సమస్య, నాగయ్య గడ్డ, నేతాజీ బస్తి ,లక్ష్మీ టాకీస్ ఏరియా, నెహ్రూ బస్తి, రాజీవ్ గాంధీ కాలనీ తదితర ఏరియాలో నెలకొన్న రోడ్లు, సైడ్ కాలువలు ,కరెంట్ పోల్స్, వీధిలైట్లు తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. తదితర సమస్యలను ఎస్టిమేట్ వేసి ప్రతి పాదనలను తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ సీతామాలక్ష్మి, 10వ వార్డు కౌన్సిలర్ మునిగడప పద్మ, వైస్ చైర్మన్ దామోదర్, కమిషనర్ నవీన్ కుమార్, ఏఈలు సాహితి, రాము, కౌన్సిలర్లు కోలాపూర్ ధర్మరాజు, రుక్మంతర్ బండారి, కూరపాటి విజయలక్ష్మి, వేణు మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.