Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వడ్రానపు మధు
- నేలకొండపల్లిలో కదం తొక్కిన విద్యార్థులు భారీ ప్రదర్శన ర్యాలీ
నవతెలంగాణ- నేలకొండపల్లి
నేలకొండపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వడ్రానపు మధు హెచ్చరించారు. మంగళవారం నేలకొండపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట ఎస్ఎఫ్ఐ మండల మహాసభ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి సుధాకర్ అధ్యక్షతన జరిగింది. తొలుత మహాసభ విజయవంతం కోరుతూ స్థానిక గౌతమీ జూనియర్ కళాశాల నుండి విద్యార్థులు ప్రభుత్వ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని నినదీస్తూ భారీ ప్రదర్శనగా బయలుదేరి భక్త రామదాసు ధ్యాన మందిరం, పొట్టి శ్రీరాములు సెంటర్ మీదుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మధు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగ సమస్యల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేస్తామని వాగ్దానం చేసి ఏడేళ్లు గడుస్తున్నా నేటికీ అమలుకు నోచుకోలేదన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంపౌండ్ వాల్ లేకపోవడంతో విష జంతువుల బెడదతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వర్షం వస్తే కాలేజీ ఆవరణమంతా చెరువును తలపించేలా మోకాళ్ళ లోతు నీటితో నిండిపోతుండడంతో విద్యార్థులు కాలేజీకి రావాలంటేనే భయపడుతున్నారన్నారు. కళాశాలలో మరుగుదొడ్లు టాయిలెట్స్ లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని, పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలు రేయంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, విద్యార్థికి నెలకు 1000 రూపాయలు పాకెట్ మనీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఎస్ఎఫ్ఐ నేలకొండపల్లి మండల కమిటీని 21 మందితో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్ష కార్యదర్శులుగా సాగర్, సందీప్, గర్ల్స్ కన్వీనర్ గా అనూష సహాయ కార్యదర్శిగా వెంకటసాయికష్ణ, కమిటీ సభ్యులుగా నవీన్, రామకష్ణ, సురేష్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు కేవీ రామిరెడ్డి, బండారు రమేష్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్, ముక్తవరత్న కిషోర్ తదితరులు పాల్గొన్నారు.