Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
వైరారోడ్ నుండి నూతన కలెక్టరేట్ కార్యాలయం వరుకు రోడ్ వెడల్పు పనులు నడుస్తున్న నేపథ్యంలో సీపీఐ(ఎం) జిల్లా బృందం శ్రీశ్రీ సర్కిల్ వద్ద వున్న శ్రీశ్రీ విగ్రహాన్ని పరిశీలన చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని శ్రీశ్రీ సర్కిల్‌గా జిల్లా ప్రజలు పిలుస్తున్న నేపధ్యంలో ఈ ప్రాంతంలోనే వున్న శ్రీశ్రీ విగ్రహాన్ని పెట్టాలని కోరారు. ఆనాడు ఖమ్మం నగరంలో వున్న పలువురు ప్రముఖులు, కళాకారులు, నగర ప్రజలు ఈ ప్రాంతంలోనే శ్రీశ్రీ విగ్రహాన్ని పెట్టారని ఆయన గుర్తుచేశారు. రోడ్ వెడల్పు చేయడానికి తాము సహకరిస్తామని, అదే సందర్భంలో ఎప్పటినుంచో ఈ సెంటర్ లోనే శ్రీశ్రీ విగ్రహాన్ని కూడా ఈ ప్రాంతంలోనే వుండాలని అయన అధికారులను కోరారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ ఈఈ శ్యామ్ ప్రసాద్, ఇతర అధికారులతో పాటు, ప్రముఖ రచయితలు క్రాంతి శ్రీనివాసరావు, ప్రసేన్, పార్టీ జిల్లా నాయకులు కళ్యాణం వెంకటేశ్వరరావు, వై విక్రమ్, మీరా సాహెబ్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.