Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రాద్రి బ్యాంక్ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి
- ప్రజా వైద్యులుగా జిల్లాపై చెరగని ముద్ర వేశారు
- రైతు సంఘం రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరరావు
- ముఖ్య అతిథిగా హాజరైన మార్కెట్ చైర్పర్సన్ డౌలే లక్ష్మి ప్రసన్న
- డాక్టర్ వైఆర్కె జయంతి సందర్భంగా ఉచిత మెగా మెడికల్ క్యాంప్
నవతెలంగాణ-ఖమ్మం కార్పొరేషన్
నిరంతర స్ఫూర్తి ప్రదాత డాక్టర్ వైఆర్కే అని, ఆయన ప్రజా వైద్యులుగా జిల్లాపై చెరగని ముద్ర వేశారని భద్రాద్రి బ్యాంక్ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి, రైతు సంఘం రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరరావు కొనియాడారు. రాజ్యసభ మాజీ సభ్యులు ప్రముఖ ప్రజా వైద్యులు డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి 94వ జయంతి సందర్భంగా నగరంలోని ప్రముఖ వైద్యులచే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని త్రీ టౌన్ ప్రాంతంలోని స్థానిక పత్తి మార్కెట్లో మార్కెట్లో మంగళవారం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని భద్రాద్రి బ్యాంక్ చైర్మన్ కృష్ణమూర్తి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. అనంతరం యాదాల చార్లెస్ అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభలో కృష్ణమూర్తి మాట్లాడుతూ వైఆర్కే తన జీవితాంతం ఆదర్శవంతమైన జీవితాన్ని ఆచరించి నేటి యువతకు స్పూర్తి ప్రదాతగా నిలిచారని పేర్కొన్నారు.
రైతు సంఘం రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరావు మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ప్రజా వైద్యులుగా డాక్టర్ వైఆర్కె చెరగని ముద్ర వేశారన్నారు. రాజ్యసభ సభ్యులుగా అనేక ప్రజా పోరాటాల చేసి పరిష్కారాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లారన్నారు. డాక్టర్ వైఆర్కె వారసత్వాన్ని వారి కుటుంబ సభ్యులు ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ డౌలే లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ.. పేదలకి డాక్టర్ వైఆర్కె పేరుతో నెల నెలా వైద్య శిబిరం ఈ ప్రాంతంలో అందిస్తున్న సేవలు చిరాస్మరణీయమని ప్రసం శించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఎర్ర శ్రీకాంత్, వైద్యులు డాక్టర్ వై రామకోటేశ్వరరావు, డాక్టర్ వై రవీందర్ నాథ్, డాక్టర్ వై రమాదేవి, డాక్టర్ వై నాగమణి, డాక్టర్ చీకటి భారవి, డాక్టర్ ఆలెనే ప్రవీణ్ కుమార్, డాక్టర్ జడల రణధీర్, డాక్టర్ పరుచూరి వెంకటేశ్వరరావు, డాక్టర్ కొల్లి అనుదీప్, డాక్టర్ గుడిపూడి రాజేష్, డాక్టర్ రావెళ్ళ రంజిత్, డాక్టర్ యం. నాగేశ్వరరావు, డాక్టర్ పగడాల దేవి వరప్రసాద్, డాక్టర్ పిల్లలమర్రి సుబ్బారావు, డాక్టర్ కే యూ భాస్కర్, డాక్టర్ పి. వెంకటేశ్వర్లు, వివిధ ప్రజా సంఘాల నాయకులు వై విక్రమ్, ఎర్ర శ్రీనివాసరావు, తుషాకుల లింగయ్య, బండారు యాకయ్య, భూక్య శ్రీనివాసరావు, కార్పొరేటర్ ఎల్లంపల్లి వెంకట్రావు, వజినేపల్లి శ్రీనివాసరావు, శీలం వీరబాబు, ఎస్ కే ఇమామ్, పత్తిపాక నాగ సులోచన, బండారు వీరబాబు, బజ్జూరి రమణారెడ్డి, సోమారపు సుధీర్, పగడాల మోహన్ రావు, మేడ బోయిన లింగయ్య, మద్ది సత్యం, వేల్పుల నాగేశ్వరరావు, పాశం సత్యనారాయణ, సారంగి పాపారావు, సోమనబోయిన వెంకటేశ్వర్లు, నాయిని నరసింహారావు పాల్గొన్నారు.