Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం కారేపల్లి మండలంలో పర్యటించారు. గ్రామాల్లో బాధితుల కుటుంబాలను కలిసి అక్కున చేర్చుకుంటూ, భరోసా కల్పిస్తూ పర్యటన సాగించారు. మాజీ ఎంపీ పొంగులేటికి గ్రామాల్లో ఘన స్వాగతం లభించింది. ప్రతి గ్రామంలో మేళతాళ్లాలతో పూలు చల్లుతూ, బాణాసంచా కాలుస్తూ గ్రామస్తులు స్వాగతం ఫలికారు. కారేపల్లి క్రాస్ రోడ్లో అనంతారపు వెంకటాచారి అల్లుడు ఇటివల మృతి చెందారు. వెంకటాచారిని పరామర్శించి సానుభూతిని తెలిపారు. లింగబంజరలో మాజీ సోసైటీ డైరక్టర్ సూరపురెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి తండ్రి సీతారామిరెడ్డి సంస్మరణ కార్యక్రమానికి హాజరై సీతారామిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు ఆర్పించారు. విష్ణువర్ధన్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, జగ్గారెడ్డి, సంజీవరెడ్డిలకు సానుభూతిని తెలిపారు. భజ్యాతండా, భీక్యాతండా, తులిశ్యాతండా గ్రామాల్లో ఇటివల మృతుల కుటుంబాలను పరామర్శించారు. తులిశ్యాతండా గిరిజన రైతులు తమ పట్టా భూమిని అధికారులు అసైన్డ్ భూమి అంటూ హద్దురాళ్లు పాతారని మాజీ ఎంపీ దృష్టికి తీసుకవచ్చారు. దీనిపై అధికారులతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. రొట్టమాకురేవు, చీమలవారిగూడెం, అనంతారం, గేటుకారేపల్లి, మేకలతండా గ్రామాల్లో పర్యటించి బాధితుల కుటుంబాలను అక్కున చేర్చుకోని ఆర్ధిక సాయం అందజేశారు. అనారోగ్యంతో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న టీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు తోటకూరి పిచ్చయ్యను పొంగులేటి పరామర్శించి అరోగ్య పరిస్ధితిని అడిగుతెలుసుకున్నారు.
ఉచిత వైద్యానికి హామీ
లింగంబంజరలో మెడపై కణితితో బాధపడుతున్న వ్యక్తికి వైద్యంకు సహకరించాలని అతని కుటుంబ సభ్యులు వేడుకోగా స్పందించిన మాజీ ఎంపీ పొంగులేటి ఖమ్మంలోని కిమ్స్ ఆసుపత్రికి ఉచితంగా వైద్య అందిస్తానని వెంటనే అసుపత్రికి వెళ్లాలని తెలిపారు. మాజీ ఎంపీ వెంట డీసీసీబీ డైరక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, కారేపల్లి మండల రైతుబంధు మండల కోఆర్డినేటర్ గుగులోత్ శ్రీను, సంత ఆలయ చైర్మన్ మల్లెల నాగేశ్వరరావు, జిల్లా నాయకులు ఇమ్మడి తిరుపతిరావు, అడ్డగోడ ఐలయ్య, మండెపూడి సత్యనారాయణ, ఎస్కె.సైదులు, తోటకూరి శ్రీనివాసరావు, పప్పుల నిర్మల, సర్పంచ్‌లు అజ్మీర నరేష్, ఆదెర్ల స్రవంతి, మొగిలి ఆదినారాయణ, గుగులోత్ పద్మామంగ్యా, భూక్యా కల్పన, బానోత్ భద్రి, బానోత్ సంధ్యారాందాస్, బానోత్ పద్మా మోహన్, ఎంపీటీసీలు ఇమ్మడి రమాదేవి,దారావత్ పాంఢ్యానాయక్, భాగం రూపానాగేశ్వరరావు, ఆలోతు ఈశ్వరీనందరాజ్, శివరాత్రి పార్వతి అచ్చయ్య, భూక్యా సోనీజామ్లా, మండల కోఆప్షన్ ఎండీ.అనీఫ్ తదితరులు పాల్గొన్నారు.