Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
ఎమ్మెల్సీ అలుగు బెల్లి నర్సిరెడ్డి సహకారంతో ఖమ్మంరూరల్ మండలం తల్లంపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని నర్సింహపురం గ్రామానికి చెందిన చిట్టెంశెట్టి శిరీషకు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరైంది. శిరీష కొద్ది నెలల క్రితం హాస్పిటల్ డెలివరీ అయ్యింది. వైద్యానికి చాలా వరకు ఖర్చు అయ్యింది. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సిఫారసు మేరకు జిల్లా కమిటీ సభ్యులు ఊరడి సుదర్శన్‌రెడ్డి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్కీ అప్లై చేయగా 23వేల రూపాయల చెక్ మంజూరు అయింది. ఈ చెక్‌ని పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ డాక్టర్ భత్తినేని వెంకటేశ్వరరావు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా సిపిఎం ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో తల్లంపాడు సిపిఎం గ్రామశాఖ కార్యదర్శి పల్లె శ్రీనివాసరావు, సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు, తల్లంపాడు ఉపసర్పంచ్ యామని ఉపేందర్, రైతు సంఘ నాయకులు మిర్యాల ఉపేందర్, మిర్యాల వెంకటేశ్వర్లు, డివైఎఫ్ఐ నాయకులు వట్టికోటి నరేష్, నువ్వుల నాగేశ్వరరావు అరవింద్, మిర్యాల నవీన్‌లు పాల్గొన్నారు.