Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ములకలపల్లి : పేదల పక్షపాతి సీఎం కేసీఆర్ అని, వారి కోసం కేసీఆర్ ప్రవేశపెట్టి అమలుచేస్తున్న పథకాలు దేశంలో మరే ఇతర రాష్ట్రాల్లో అమలులో లేవని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కొనియాడారు. మంగళవారం ఆయన మండలంలో విస్తృతంగా పర్యటించారు. తొలుత మండల కేంద్రమైన ములకలపల్లిలో రైతువేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరై 38 మంది లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎన్నో బృహత్తర పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని, వాటిలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబంధు, రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ సరఫరా వంటి పథకాలు ఎంతో గొప్పవని, ఇలాంటి పథకాలు దేశంలోనే మరే ఇతర రాష్ట్రాల్లో అమలులో లేవన్నారు. అనంతరం ములకలపల్లి చేరుకున్న ఆయన కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయంలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. అనంతరం ములకలపల్లి, రాజాపురం, జగన్నాధపురంలోని పలు కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోరంపూడి అప్పారావు, కార్యదర్శి శెనగపాటి అంజి, జడ్పీటీసీ సున్నం నాగమణి, తహశీల్దార్ వీరభద్రం, ఎంపీవో లక్ష్మయ్య, ఎంపీటీసీ మెహరామణి, సర్పంచ్లు బైటి రాజేష్, కారం సుధీర్, వాడే నాగరాజు, గొల్ల పెంటయ్య, గడ్డం భవానీ, వగ్గెల రమణ, కీసరి శ్రీను, వాడే లక్ష్మి, సున్నం సుశీల, బీఆర్ఎస్ నాయకులు పామర్తి వెంకటేశ్వరరావు, అమర్నాథ్, మంగపతి, చందర్రావు పాల్గొన్నారు.