Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నగర మేయర్ పునుకొల్లు నీరజ
- మంచినీటి సరఫరాపై ప్రత్యేక సమీక్ష సమావేశం
నవతెలంగాణ-ఖమ్మం కార్పొరేషన్
మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించుకోవాలని నగర మేయర్ పునుకొల్లు నీరజ ఆదేశించారు. ఖమ్మం మున్సిపల్ నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం మంచినీటి సరఫరాపై మేయర్ నీరజ మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభితో కలిసి ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేయర్ నీరజ మాట్లాడుతూ.. డివిజన్ ప్రజలకు ఇబ్బంది కలగకుండా లైన్ మెన్లు వాల్ ఆపరేటర్స్ కలసి బాధ్యతగా విధులను నిర్వహించి నీటి సప్లై చూసుకోవాలని అన్నారు. ఫీల్టర్ బెడ్ నుండి మంచినీటి బంఢాగారాలను సమయానికి నింపుకొని ప్రాంతాల వారీగా మంచినీటి సప్లై ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు వదలాలని అన్నారు. లీకేజీల ను వెంటనే మరమ్మతులు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పబ్లిక్ హెల్త్ ఎస్.ఈ రంజిత్, ఈ.ఈ కృష్ణ లాల్, డిఈఈలు ఏఈలు, లైన్ మెన్లు, వాల్ ఆపరేటర్లు,తదితరులు పాల్గొన్నారు.