Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో సీసీ, డ్రైన్ల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. కొత్తగూడెంను అభివృద్దిలో నెంబర్1 గా చేస్తానని, పార్టీల ఆతితంగా అభివృధ్ది నిధులు మంజూరు చేశామన్నారు. పట్టణంలోని 26, 1,2,3, 4,27, వార్డులలో సిసి రోడ్లకు, సైడ్ ట్రైన్ లకు, సుమారు రూ.50 లక్షలతో శంకుస్థాపన చేశామని తెలిపారు. రామవరం 14. నెంబర్ సెంటర్ నుంచి. పాల్వంచ పెద్దమ్మ గుడి వరకు సెంట్రల్ లైటింగ్‌కు కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, జెడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, మున్సిపల్ కౌన్సిలర్. కో-ఆప్షన్ సభ్యులు, దిశా కమిటీ సభ్యులు, ఆత్మ కమిటీ చైర్మన్, ఉర్దూఘర్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.