Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మణుగూరు : మండలంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసన సభ్యులు రేగా కాంతారావు అన్నారు. గురువారం స్థానిక వంద పడకల ఆసుపత్రిని సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జ్వరం వస్తే ప్రజలు అశ్రద్ద చేయకూడదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించి మెరుగైనా వైద్యం పొందాలన్నారు. ఇటీవల కాలంలో జ్వరం బారీన పడిన ప్రజలు మృత్యువాతకు గురయ్యారన్నారు. పని ఒత్తిడి, ఆర్దికలేమితో స్థానిక వైద్యులను సంప్రదించకుండా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యం పొందాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వసతులు ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరిడెంట్ పంచగిరి గిరి ప్రసాద్, వైద్య బృందం, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయాలి
భారతరాష్ట్ర సమితి బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పిలుపునిచ్చారు.గురువారం క్యాంపు కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, నాయకులు బూర్గంపహాడ్ మండల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చూసి ఓర్వలేక బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రానున్నా రోజుల్లో విజయాలు సాధించి హ్యాట్రిక్ సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ముదిరాజ్ల అభివృద్దికి కేసిఆర్ కృషి...
ముదిరాజ్ల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసిఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు అన్నారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ముదిరాజ్ మండల స్థాయి సమావేశంలో ఆయనమాట్లాడుతూ ముదిరాజ్లు అన్ని రంగాల్లో ఎదగాలన్నారు.