Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-చండ్రుగొండ
ప్రతి విద్యార్థి చదవటం, రాయటం నేర్పాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఉపాధ్యాయులను ఆదేశించారు. గురువారం మండలంలోని దామరచర్ల ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థులతో బోర్డుపై ఉన్న నాలుగు అక్షరాల పదాలు చదివించారు. విద్యార్థిని విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి ప్రతి విద్యార్ధికి కనీస సామర్థ్యాలు చదవడం, రాయడం వచ్చే విధంగా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని తొలిమెట్టు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని వచ్చే సందర్శన నాటికి ప్రతి విద్యార్థి చదవటం, రాయటం వచ్చే విధంగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు సూచించారు. మన ఊరు మన బడి పనులను పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత శాఖాధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ సుధాకర్, మండల ఏఈ శ్రీనివాస్, జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ శర్మ, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి నాగరాజు శేఖర్, తహసీల్దార్ వరుస రవికుమార్, జెడ్పీహెచ్ఎస్ చండ్రుగొండ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ టీ.ఆనంద్ కుమార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి డి అన్నపూర్ణ, దామరచర్ల పాఠశాల హెడ్మాస్టర్ శ్రీరాములు, కాంప్లెక్స్ సిఆర్పీ సేవ్య, సర్పంచ్ వీరప్ప లక్ష్మీపతి, పాల్గొన్నారు.
అనంతరం ప్రాథమిక వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. సిబ్బందితో సమావేశం నిర్వహించారు. డాక్టర్ సెలవుపై వెళ్లిన విషయాన్ని డిఎంహెచ్ఓతో ఫోన్లో మాట్లాడారు.