Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మచ్చ వెంకటేశ్వర్లు, అన్నవరపు కనకయ్య
నవతెలంగాణ-సుజాతనగర్
పెరిగిన ధరలకనుగుణంగా వ్యవసాయ కూలి రేట్లు తక్షణమే పెంచాలని
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు అన్నవరపు కనకయ్య డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని చింతలపూడి సత్యం భవన్లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం 3వ మండల మహాసభ గండమల భాస్కర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభలో వారు పాల్గొని మాట్లాడుతూ పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇంటి నిర్మాణానికి 5లక్షల రూపాయలు ఇవ్వాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి పేదలపై భారాలు మోపుతుందని విమర్శించారు. వెంటనే పెంచిన గ్యాస్, పెట్రోల్ డీజిల్ ధరలను, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల పరీక్షలు ఉచితం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు రేపాకు శ్రీనివాస్, జిల్లా నాయకులు వీర్ల రమేష్, బచ్చలికూర శ్రీనివాస్, శ్రీకాంత్, వీరు, శారద, మురిపిటి నాగేష్, సోలం నాగరత్నమ్మ, అంజమ్మ, కైరూన్ బీ, జబ్బ నాగమణి తదితరులు పాల్గొన్నారు.