Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందరూ అంకిత భావంతో పనిచేస్తున్నారు.
- ఆత్మీయ సమ్మేళనంలో జిల్లా కలెక్టర్ అనుదీప్
- అవార్డులు ప్రదానం
నవతెలంగాణ-కొత్తగూడెం
స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్‌లో మన జిల్లా జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన సందర్భంగా గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఏపీవోలు, ఈసీలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన పనితనం ఆధారంగానే జాతీయ స్థాయిలో అవార్డు వచ్చినట్లు తెలిపారు. గ్రామ స్థాయి నుండి క్షేత్రస్థాయి నుండి ప్రతి ఒక్కరు అంకితభావంతో పనిచేయటం వల్ల మనకి అవార్డు లభించినట్లు చెప్పారు. దేశంలోని 766 జిల్లాలలో మన జిల్లా పరిశుభ్రతలో 3వ స్థానం సాధించడం అంటే మామూలు విషయం కాదని చెప్పారు. మంచి పేరు సాధించడం ఎంత కష్టమో నిలుపు కోవడం కూడా అంతే ముఖ్యమన్నారు. మరిన్ని అవార్డులు సాధన దిశగా మనందరం ఐకమత్యంగా సమిష్టి కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. భవిష్యత్తులో ఇంతకంటే మెరుగైన అవార్డులు సాధించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజా ప్రజావసరాలను దృష్టిలో పెట్టుకొని పని చేయడం కోసం కార్యచరణ తయారు చేయాలని చెప్పారు. మన చేసిన పనికి దేశస్థాయిలో లభించిన గొప్ప గౌరవ మని తెలిపారు. మారుమూల ప్రాంతమైనప్పటికి ఎన్నో సమస్యలను అధిగమించి, గడిచిన రెండు సంవత్సరాల్లో మనం చేసిన కృషికి లభించిన గొప్ప గౌరవమని ఈ సందర్భంగా ఆయన ప్రతి ఒక్కరు అభినందించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి లోటు పాట్లు రాకుండా కృషి చేస్తే అవార్డులు సాధన కష్టమేమి కాదని ఆయన తెలిపారు. అభివృద్ధిలో గ్రామ పంచాయతీలు పొటీతత్వంతో పని చేయాలని సూచించా రు. గ్రామాల్లో స్వచ్ఛత, పరిశుభ్రత కార్యక్రమాల పై అత్యంత ఫోకస్ పెట్టాలన్నారు. ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని చెప్పారు. శ్రీరామ నవమి, గోదావరి వరదల సమయంలో మన సేవలకు ప్రశంసలు లభించాయని చెప్పారు. చేయాలన్న పట్టుదలతో పాటు విధుల నిర్వహణలో అంకితభావం అత్యంత అవసరమని చెప్పారు. జిల్లాలో 107 బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు లక్ష్యం కాగా 67 పూర్తి చేశామని, మిగిలిన వాటిని తహసిల్దార్లను సమన్వయం చేసుకుంటూ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. తెలంగాణకు క్రీడా ప్రాంగణాలు ప్రతి గ్రామ పంచాయతీకి ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలని చెప్పారు. అనంతరం ఎంపీవోలను, ఎంపీడీవోలను, ఏపీఓలను, ఈసీలను శాలువా, మెమెంటోలతో కలెక్టర్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ మధుసూదన్ రాజు, జడ్పి సీఈఓ విద్యాలత, డిపిఓ రమాకాంత్, అన్ని మండలాల ఎంపీడివోలు, ఎంపీవోలు, ఏపీవోలు, ఈసిలు తదితరులు పాల్గొన్నారు.