Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరితగతిన పనులు పూర్తిచేయాలని అధికారులకు మంత్రి ఆదేశం
నవతెలంగాణ - ఖమ్మం కార్పొరేషన్
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని త్రీ టౌన్ ప్రాంతంలో కొనసాగుతున్న గోళ్లపాడు చానల్ ఆధునికీకరణ పనులను గురువారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ పరిశీలించారు. తొలుత ప్రకాష్ నగర్, శ్రీనివాస నగర్, వ్యవసాయ మార్కెట్ వెనుక, పంపింగ్ వెల్ రోడ్, రంగనాయకుల గుట్ట, దర్గా దగ్గర, సుందరయ్య పార్క్, పిల్లి కృష్ణ తోట, కాల్వ ఒడ్డు, ట్రంక్ రోడ్లో గల వీధి వ్యాపారుల సముదాయం తదితర ప్రాంతాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ వీపీ గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ. అసంపూర్తిగా ఉన్న పనుల వేగం పెంచాలని ఆదేశించారు. ఇప్పటికే చాలా ఆలస్యంగా అయిందన్నారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఈఈలు రంజిత్, కృష్ణలాల్, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శైలజ, అధికారులు పాల్గొన్నారు.