Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోడు సాగుదారులకు సర్వేతో న్యాయం జరగాలి : రైతు సంఘం
నవతెలంగాణ-కారేపల్లి
కేంద్ర ప్రభుత్వ విధానాలతో ఎరువుల ధరలకు రెక్కలు వచ్చాయని తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దుగ్గి కృష్ణ విమర్శించారు. గురువారం కారేపల్లిలో రైతు సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం ముండ్ల ఏకాంబరం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో దుగ్గి కృష్ణ మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలతో రైతును దివాళ్ల తీయించటానికి పూనుకున్న మోడీ ప్రభుత్వం రైతాంగం సంఘటితంగా నల్లచట్టాలపై రాజీ పోరాటాలతో దిగివచ్చిందన్నారు. స్వామినాధన్ కమీషన్ సిపార్స్లను అమలు ద్వారానే రైతుకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఏజన్సీలో పోడు సర్వేతో పోడు సాగు రైతును న్యాయం జరగాలని ఆకాంక్షించారు. పేదల పోడు సాగు చేసుకుంటున్న పోడుకు అంక్షలు లేకుండా హక్కుల కల్పించాలని అధికారులనుకోరారు. రైతాంగ సమస్యలపై సంఘటిత పోరాటాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంపీటీసీ వడ్డె అజరుబాబు, రైతు సంఘం నాయకులు వజ్జా రామారావు, పాసిన్ని రామారావు, బొజెడ్ల గోవిందరావు, పిప్పల కృష్ణ, మాలోత్ రాంకోటి తదితరులు పాల్గొన్నారు.