Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-తిరుమలాయపాలెం
పప్పుల భద్రయ్య ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. స్థానిక పిండిప్రోలు గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు పప్పుల భద్రయ్య సంస్మరణ సభకు తమ్మినేని వీరభద్రం హాజరై ప్రసంగించారు. ఈ సభకు పార్టీ మండల కార్యదర్శి కొమ్ము శ్రీను అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ పప్పుల భద్రయ్య నిజమైన కమ్యూనిస్టు కార్యకర్తగా జీవించారని, అందుకే పప్పుల భద్రయ్య ఆశయాల కోసం, ఆయన నమ్ముకున్న సిద్ధాంతం కోసం అందరం శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. ఈ సభలో పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు బుగ్గవీటి సరళ, పార్టీ పాలేరు నియోజకవర్గ ఇన్చార్జ్ బండి రమేష్, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, తిరుమలాయపాలెం మండల ఇంచార్జ్ షేక్ బషీరుద్దీన్, పార్టీ సీనియర్ నాయకులు దుండేటి ఆనందరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సభలో నాయకులు అంగిరేకుల నరసయ్య, పద్మనాభల సుధాకర్, వేగినాటి వెంకట్రావు, కొల్లూరు నాగేశ్వరరావు, బింగి రమేష్, కొలిచలం స్వామి, వశిపొంగు వీరన్న,నేరుసుల వెంకటేశ్వర్లు, వెంకన్న, రేపాకుల వెంకన్న, వెంకటరామిరెడ్డి, గ్రామ నాయకులు రమణ బోయిన రవి, పప్పుల ఉపేందర్, చల్లా వెంకటేశ్వర్లు, పాంపాటి బాబు, చామకూరి నాగభూషణం, వీరస్వామి, సుందరయ్య, మంగపతి, దొండేడి సుగుణమ్మ, దొండేటి నిర్మలరావు భార్య పప్పుల తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ(ఎం) మహిళా కార్యకర్త మృతి
నవతెలంగాణ- ముదిగొండ
మండలపరిధిలో గోకినేపల్లి గ్రామానికి చెందిన సిపిఐ (ఎం) మహిళా సీనియర్ కార్యకర్త తోర్తి వీరమ్మ (75) అనారోగ్యంతో గురువారం మృతి చెందింది. మృతదేహాన్ని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్రనాయకులు మన్నేపల్లి సుబ్బారావు, బుగ్గవీటి సరళ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్‌లు సందర్శించి నివాళ్లర్పించారు. వీరమ్మకు భర్త, నలుగురు కుమారులు ఉన్నారు. నివాల్లర్పించిన వారిలో సిపిఐ(ఎం) జిల్లా నాయకులు వాసిరెడ్డి వరప్రసాద్, బండి పద్మ, మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం, నాయకులు పయ్యావుల పుల్లయ్య, పయ్యావుల ప్రభావతి, కోలేటి అరుణ, వేల్పుల భద్రయ్య, టీఎస్ కళ్యాణ్, మేడా నారాయణ, ఇబ్రహీం, ఇరుకు నాగేశ్వరరావు పాల్గొన్నారు.