Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
సింగరేణి ఆధ్వర్యంలో నో హెల్మెట్ నో ఎంట్రీ, హెల్మెట్ ధారణ ప్రమాదాల నివారణ అవగాహన కార్యక్రమాన్ని మణుగూరు ఏరియా సింగరేణి రక్షణ అధికారి జెవి రమణ పర్యవేక్షణలో నిర్వహించారు. గురువారం ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ ఏరియా జనరల్ మేనేజర్ జి.వేంకటేశ్వర రెడ్డి ఆదేశం మేరకు హెల్మెట్ ధరించవలసిన ఆవశ్యకతపై సింగరేణి మెయిన్ చెక్ పోస్ట్ వద్ద హెల్మెట్ వాడకం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారన్నారు. ఈ అంశంపై నేటి నుండి ఏరియాలో పూర్తిస్థాయి 'నో హెల్మెట్ నో ఎంట్రీ' కార్యక్రమం అమలు చేయనున్నామని అధికారులు కార్మికులు సూపర్వైజర్లు కాంటాక్ట్ కార్మికులు కార్మిక సంఘాల నాయకులు అనే వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించి సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పీకే ఓసి రక్షణ అధికారి ఎం.లింగబాబు, సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.