Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వాపురం
గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ టీపీటీఎఫ్ పిలుపుమేరకు గురువారం మండల పరిధిలోని ప్రభుత్వ గిరిజన ఉన్నత పాఠాశాల గొందిగుడెం ఉపాధ్యాయులు భోజన విరామం తరువాత నల్లబ్యార్జిలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్షణమే కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలలో పోస్టులు మంజూరు చేసి భర్తీచేయాలన్నారు. ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలను తక్షణమే నిర్వహించి, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పండిట్స్, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను ఉన్నతీకరించి వారికి పదోన్నతులు ఇవ్వాలన్నారు. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను రెగ్యులర్ చేసి వారికి 12 నెలల జీతాలు చెల్లించాలని, గిరిజన సంక్షేమ శాఖలోని ఉద్యోగుల నిష్పత్తి ఆధారంగా ఉపాధ్యాయులకు ఏటీడీఓ, డీటీడీఓ పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే అన్నీ ఆశ్రమ పాఠశాలల్లో ప్రత్యేక సంక్షేమఅధికారులను నియమించి, డైలీవేజ్ వర్కర్స్నీ రెగ్యులర్ చేయదాంతో పాటు ప్రతి పాఠశాలకు ఏఎన్ఎం పోస్టులు మంజూరు చేయాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో రామారావు, వీరస్వామి, కిషన్,నగేష్, రాజేష్, కొండబాబు తారా సింగ్ పాల్గొన్నారు.
ములకలపల్లి : ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీపీటీఎఫ్ పిలుపుమేరకు గురువారం ప్రభుత్వ గిరిజన ఉన్నత పాఠాశాల కమలాపురంలో ఉపాధ్యాయులు భోజన విరామం తరువాత నల్లబ్యార్జిలతో నిరశన తెలిపారు.
మణుగూరు : గిరిజన సంక్షేమ శాఖలో పని చేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, అదనపు పని భారాన్ని తగ్గించాలని అనేకసార్లు ఐటిడిఏ భద్రాచలం పీఓకి, కమిషనర్ గిరిజన సంక్షేమ శాఖ హైదరాబాద్కి ప్రాతినిధ్యాలు చేసినప్పటికీ సమస్యలు పరిష్కరించలేదన్నారు. కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలలకు రెగ్యులర్ ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేసి స్పెషల్ టిఆర్టి ద్వారా ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్నారు.
ఆళ్ళపల్లి : గిరిజన సంక్షేమ శాఖలో చాలాకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల, పాఠశాలల సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు జోగ రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మండల పరిధిలోని మర్కోడు గ్రామం బాలుర ఆశ్రమ పాఠశాలలో టీపీటీఎఫ్ సంఘం నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను తెలిపారు. మర్కోడు బాలుర ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీహెచ్ బుచ్చిరాములు, వై.నాగేశ్వర్రావు, కొమరం రాంబాబు, కల్తి వసంతరావు, జి.జోగయ్య, ఈ.రాంబాబు, కె.వెంకన్న, వీరన్న, కొమరం వసంతరావు, పి.ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు.