Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
మండల పరిధిలోని అనంతోగు గ్రామంలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను స్థానిక ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాతో పాటు వివిధ గ్రామాల మహిళా సర్పంచ్‌లు కొమరం బాయమ్మ, పాయం శ్రీదేవి, పూనెం నిర్మల, ఉప సర్పంచ్‌లు కుర్ర కమల, సుజాత, విద్యార్థినులతో నిద్రించనున్నామన్నారు. ఆశ్రమ పాఠశాలలో 14 మంది ఉపాధ్యాయులకు గాను 5 ఉపాధ్యాయులే ఉన్నారని తెలిపారు. పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన టాయిలెట్స్, ట్యాప్స్ కొన్ని పనిచేయక వాడకంలోలేవని గుర్తించానని అన్నారు. టాయిలెట్స్‌లో డస్ట్ బిన్ ఏర్పాటు, ఫ్యాన్లు 80 శాతం పని చేయడం, లైట్స్ అందుబాటులో లేవు, జనరేటర్ పూర్తిగా పనిచేయడం లేదని చెప్పారు. అలాగే సోలార్ విద్యుత్ సెట్ మరమ్మతులకు గురైనది, చలికాలం కావడంతో వేడినీళ్లు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థినులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మెడికల్ రూంలో మందులు, ఏఎన్ఎం అందుబాటులో లేవని, పిల్లలకు ఇవ్వాల్సిన ప్లేట్, గ్లాస్లు, తదితర వస్తువులను 2018 సంవత్సరం నుంచి ఇవ్వడం లేదని చెప్పారు. స్థానికంగా ఉండవలసిన ఉపాధ్యాయులు ఆశ్రమ పాఠశాలలో ఉండకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవలే కాచనపల్లి గ్రామం బాలికల ఆశ్రమ పాఠశాలలో సంఘటన జరిగినప్పటికీ ఉపాధ్యాయుల్లో ఎటువంటి చలనం లేకపోగా విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారని మండిపడ్డారు.
దుమ్ముగూడెం : మండలంలోని కొత్తపల్లి గిరిజన బాలుర వసతి గృహాన్ని ఎంపీపీ రేసు లకీë గురువారం ఆకిస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం విద్యార్దుల ప్రార్దన కార్యక్రమంలోకి పాల్గొని విద్యార్ధులకు వసతి గృహంలో అందుతున్న సౌకర్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో ప్రతి రోజు అందుతున్న మెనూ, ఉపాద్యాయుల విద్యాబోదన, పదవతరగతి విద్యార్దుల కోసం ప్రతి రోజు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్ధులకు అందిస్తున్న మెనూ, విద్యా బోదన గురించి ప్రదానోపాధ్యాయుడు మడకం మోతీర్ను ఆమె అభినందించారు. ఆమె వెంట కొత్తపల్లి ఎంపీటీసీ సభ్యుడు పూసం ముద్దరాజు, టీఆర్ఎస్ పార్టీ మండల ప్రదాన కార్యదర్శి కణితి రాముడు, కారం వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.