Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
మోటార్ రంగం డ్రైవర్ కమ్ ఓనర్ల సంక్షేమంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఆర్.మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలన్నారు. సెంట్రల్ మోటార్ వెహికల్ సవరణ బిల్ 2019 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదాల్లో మరణించిన డ్రైవర్లకు ప్రభుత్వం కల్పిస్తున్న రూ.5 లక్షల భీమాను రూ.10 లక్షలకు పెంచి పథకాన్ని నిరంతరం కొనసాగించాలని ఆయన కోరారు. ప్రయివేట్ ఫైనాన్సర్ల దోపిడిని అరికట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు ఎండీ గౌస్, డ్రైవర్లు సతీష్, వీరాచారి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.