Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ మండల అధ్యక్షులు అంకా శ్రీనివాసరావు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
దేశ సమైఖ్యతను కాపాడేందుకు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేపట్టినట్లు కాంగ్రెస్ పార్టీ మండల అద్యక్షులు లంకా శ్రీనివాసరావు అన్నారు. గురువారం లకీëనగరం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణలో జరుగుతున్న భారత్ జోడో యాత్ర పోష్టర్ను ఆయన పార్టీ నాయకులతో కలసి విడుదల చేశారు. తెలంగాణలో సాగుతున్న జోడో యాత్రలో పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బైరుడ్డి సీతారామారావు, శీరపు అప్పలరెడ్డి, పిలకా వెంకటరమణారెడ్డి, భద్రాచలం డివిజన్ యూత్ అద్యక్షులు లంకా శివ, కంగాల వెంకటేష్ , యువజన కాంగ్రెస్ నాయకులు కనుబుద్ది దేవా పాల్గొన్నారు.