Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోండి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించవద్దని ఎస్పీ వినీత్.జి పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో ఎస్పీ నెలవారి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రౌడీ షీటర్లు, పాత నేరస్తుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ మరలా ఏదైనా నేరానికి పాల్పడితే వారిపై పీడీయాక్టులను నమోదు చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా వర్టికల్స్ వారీగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజ్, కొత్తగూడెం డిఎస్పీ వెంకటేశ్వర బాబు, ఇల్లందు డిఎస్పీ రమణమూర్తి, మణుగూరు డిఎస్పీ రాఘవేంద్రరావు, డీసీఆర్బీ సిఐ ఉపేందర్, సిఐలు, ఎస్సైలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.