Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడ్మిషన్ పత్రాన్ని అందచేసి, శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలో ఈ విద్యాసంవత్సరం నుండి వైద్య తరగతులు ప్రారంభం కానున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. గురువారం జాతీయ మెడికల్ కౌన్సిల్ ద్వారా వైద్య కళాశాలకు కేటాయించిన విద్యార్థులకు కలెక్టర్ అడ్మిషన్ పత్రాన్ని అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేరళ రాష్ట్రానికి చెందిన శ్రేయా నాయర్ అనే విద్యార్థిని వైద్య కళాశాలలో అడ్మిషన్ తీసుకున్నారు. గురువారం విద్యార్థి కళాశాలలో జాయిన్ కావడానికి వచ్చిన సందర్భంగా ఆమెకు అడ్మిషన్ పత్రాన్ని కలెక్టర్ అందజేశారు. శుభాకాంక్షలు తెలిపారు. నవంబర్ 15 నుండి వైద్య తరగతులు ప్రారంభం కానున్నట్లు చెప్పారు. వైద్య కళాశాల ఏర్పాటుతో మన జిల్లాలో వైద్యుల కొరత తీరుతుందని ఆయన చెప్పారు. కేంద్ర, రాష్ట్ర కోటాలో 150 మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించడానికి అవకాశం ఉందని చెప్పారు. వైద్య కళాశాల భవనాన్ని యుద్ధ ప్రాతిపదికన నిర్మించిన రహదారులు భవనాల శాఖ అధికారులను, వైద్య కళాశాల సిబ్బందిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కళాశాలలో విద్య నభ్యసించిన విద్యార్ధులు ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని, వైద్యసేవల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ ఈఈ భీమ్లా, డియంఈ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణరావు, సూపరిటెండెంట్ డాక్టర్ కుమారస్వామి, డాక్టర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.