Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవతెలంగాణ ఎఫెక్ట్
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
వరుస మరణలతో వణుకుతున్న రాజపురం అని నవతెలంగాణలో కథనం వెలువడడంతో రాజపురం గ్రామంలో గురువారం వైద్య సిబ్బంది ఆధ్యర్యంలో గురువారం ఏర్పాటు చేశారు. విష జ్వరాలతో బాధపడుతున్న వైద్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ప్రాణాలు కోల్పోవద్దని వైద్య సిబ్బంది, ఏఎన్ఎం వాణి పుస్పరాజ్యం ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొత్తం ఈ వైద్య శిబిరంలో 76 మందికి ఓపి రాయడం జరిగిందని, వారిలో నలుగురు సుగర్, ఆరుగురు బీప,ీ ఇద్దరు జ్వరపిడితులు వున్నారని తెలిపారు. వారికి తగిన మందులు పంపిణీ చేశామన్నారు. ఎవరికి అయినా జ్వరం వచ్చిన వెంటనే ఆశా వర్కర్లుని గానీ, ఏఎన్ఎంలను సంప్రదించి తగిన సలహాలు, సూచనలు తీసుకోవాలని అన్నారు. ప్రతి రోజు హెల్త్ సబ్ సెంటర్ నందు వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని, చిన్న చిన్న జ్వరాలతో బాధపడుతూ రోజులు తరబడి రక్త పరీక్షలు చేయించుకొకపోవడం వలన రక్త కణాలు తగ్గిపోయి డెంగ్యూ బారిన పడుతున్నారన్నారు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమం లో ఆశా వర్కర్లు స్వరూప, సుభద్ర పాల్గొన్నారు.