Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన సీపీ విష్ణు ఎస్.వారియర్
నవతెలంగాణ-కారేపల్లి
నేరాల నియంత్రణకు పోలీస్ స్టేషన్ల పరిధిలో గస్తీని పెంచాలని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్ ఆదేశించారు. గురువారం కారేపల్లి పోలీస్ స్టేషన్, సీఐ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు.రిసెప్షన్ రికార్డులను తనిఖీ చేసి విధుల నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. సింగరేణి సర్కిల్ పరిధిలో కేసుల వివరాలు, నేరాల పై సమీక్షించారు. ఈసందర్బంగా సీపీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ప్రతి ఒక్కరిగా జవాబుదారిగా సిబ్బంది విధులు నిర్వర్తించాలన్నారు. ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్ ఆవరణంలో మొక్కలను నాటారు. సీపీ వెంట ఖమ్మం రూరల్ ఏసీపీ బస్వారెడ్డి, సింగరేణి సీఐ అరిఫ్ అలీఖాన్, కారేపల్లి, కామేపల్లి ఎస్సైలు పోలోజు కుశకుమార్, కిరణ్‌కుమార్‌లు ఉన్నారు.