Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పైలట్ ప్రాజెక్టు క్రింద ఖమ్మం జిల్లా ఎంపిక
- రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ రంజిత్
నవతెలంగాణ-కారేపల్లి
తలసేమియా, సికెల్ సెల్ ఎనిమియా వ్యాధితో పుట్టబోయే బిడ్డకు ముప్పు ఉంటుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య పరిశీలకులు డాక్టర్ రంజిత్ అన్నారు. గురువారం కారేపల్లి పీహెచ్సీలో గర్భిణీలకు తలసేమియా, సికెల్ సెల్ ఎనిమియా స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించారు. వైద్య పరీక్షలను రాష్ట్ర పరిశీలకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కారేపల్లి మండలంలో 64 మంది గర్భిణీలను గుర్తించి వారికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురువారం 19 మందికి రక్తనమూనాలను తీసి పరీక్షకు పంపించటం జరిగిందన్నారు. తల్లిదండ్రులో తలసేమియా సోకితే వారికి పుట్టబోయే బిడ్డకు ఆ వ్యాధి సోకే అవకాశం 25 శాతం ఉందన్నారు. తల్లిదండ్రులు ఒకరికి మాత్రమే తలసేమియా ఉంటే బిడ్డకు వచ్చే చాన్స్ తక్కువేనన్నారు. తలసేమియాపై ఫైలెట్ ప్రాజెక్టు తెలంగాణలో 11 జిల్లాలు ఎంపిక చేశారని దానిలో ఖమ్మం జిల్లా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోగ్రాం మేనేజర్ నిలోహన, కారేపల్లి మండల వైద్యాధికారి డాక్టర్ వై.హన్మంతరావు, ల్యాబ్ అసిస్టెంట్ జియావుద్దీన్ తదితరులు ఉన్నారు.