Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రీడాపోటీలు
- నేటి నుంచి కబడ్డీ, వాలీబాల్ రాష్ట్రస్థాయి టోర్నమెంట్
- ఖమ్మం సర్దార్ పటేల్ , కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో పోటీలు
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు నిర్వహించనున్నారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో డే అండ్ నైట్ కబడ్డీ పోటీలు, కొత్తగూడెంలోని ప్రకాశం మైదానంలో వాలీబాల్ పోటీలు జరుగుతాయి. కబడ్డీ పోటీలు 28 నుంచి 30వ తేదీ వరకు, వాలీబాల్ పోటీలు 28 నుంచి 31వ తేదీ వరకు జరగనున్నాయి. పోటీలకు హాజరయ్యే క్రీడాకారుల కోసం ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పించినట్లు ట్రస్ట్ బాధ్యులు తెలిపారు. పురుషులు, మహిళా విభాగాల్లో కబడ్డీ , జూనియర్స్ బాలబాలికలకు వాలీబాల్ పోటీలు నిర్వహిస్తారు. కబడ్డీ విజేతకు రూ. లక్ష మొదటి బహుమతిగా అందజేస్తారు. ఈ టోర్నీకి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు నిర్వహకులు తెలిపారు.