Authorization
Fri March 21, 2025 12:41:04 pm
నవతెలంగాణ ఖమ్మం (ఖమ్మం రూరల్)
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్ పిలుపునిచ్చారు. గురువారం సిపిఎం ఖమ్మం రూరల్ మండలం విస్తృత స్థాయి సమావేశం వరంగల్ క్రాస్ రోడ్డు లోని తమ్మినేని సుబ్బయ్య భవన్లో ఏటుకూరి పద్మ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ఏజెండాగా నిబద్ధతతో ప్రజా పోరాటాలు పార్టీ కర్తవ్యం అని అన్నారు. డిసెంబర్ 5, 6, 7 తేదీలలో జరిగే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడో మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్, రూరల్ మండల ఇన్చార్జ్ ఊరడి సుదర్శన్ రెడ్డి, మండల కార్యదర్శి వర్గ సభ్యులు పొన్నెకంటి సంగయ్య, తోట పెద్ద వెంకటరెడ్డి, నందిగామ కృష్ణ, యామన ఉపేందర్ ,పెండ్యాల సుమతి, పెరుమలపల్లి మోహన్ రావు, పార్టీ మండల కమిటీ సభ్యులు వడ్లమూడి నాగేశ్వరరావు, చావ నాగేశ్వరరావు, కారుమంచి గురవయ్య, వరగాని మోహన్ రావు, ఏటుకూరి ప్రసాద్, అరవపల్లి శ్రీనివాస్, దుండిగల వెంకటేశ్వర్లు, పొన్నం వెంకటరమణ, భూక్య నాగేశ్వరరావు, శాఖ కార్యదర్శులు పెంట్యాల నాగేశ్వరరావు, వరగానే వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
వ్యకాసం రాష్ట్ర మహాసభల ప్రచారం
ఆరెంపుల గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక గ్రామ శాఖ ఆధ్వర్యంలో గురువారం ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘాల నాయకులు.పెరుమాళ్ళపల్లి మోహన్ రావు, వల్లూరి సీతారాం రెడ్డి, వల్లబి మోహన్ రావు, చిర్రా లాలు, గడ్డం వెంకయ్య, గుండె తిరపయ్య, గోపి, పాల్గొన్నారు.