Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తల్లిపాలు తాగి రొమ్ముతన్నే సంస్కృతి రెండు పార్టీలది
- కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్
నవతెలంగాణ-ఖమ్మం
అటు దేశంలో ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్ట్మాత్మకమైన ప్రజాస్వామ్యాన్ని నీరుగార్చే విధంగా వ్యవహారిస్తున్నాయని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ఆరోపించారు. గురువారం ఖమ్మంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయం (సంజీవరెడ్డి భవనం)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులకు తెలంగాణ రాష్ట్ర సమితి ఆజ్యం పోస్తే బీజేపీ దానిని అమలు పరుస్తోందని ఎద్దేవా చేశారు. ప్రజా సంక్షేమాన్ని, ప్రజా సమస్యలను గాలికి వదిలేసి రెండు పార్టీలు అధికారం కోసం అంపర్లాడుతున్నాయని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, టీఆర్ఎస్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రెండు ప్రభుత్వాలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మొయినాబాద్ ఫాంహౌన్ సంఘటనను సీబీసీఐడితో గాని సిట్టింగ్ జడ్జితో గాని విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఫాంహౌ హౌజ్ లో ఉన్న ఎమ్మెల్యేలు గతంలో కాంగ్రెస్ నుండి అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలే అని మళ్ళీ ఇప్పుడు అమ్ముడు పోవడానికి వచ్చి అడ్డంగా బుక్కయ్యారని, ఇలాంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్న దోషులను పట్టుకుని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావేద్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గతంలో కేసీఆర్ కొన్న ఎమ్మెల్యేలపై ఇప్పుడు బీజేపీ బేరం పెట్టిన ఎమ్మెల్యేలపై విచారణ చేయించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, జిల్లా యువజన కాంగ్రెస్ అద్యక్షులు యడ్లపల్లి సంతోష్, రాష్ట్ర మైనారిటీ నాయకులు బియచ్ రబ్బాని, జిల్లా కాంగ్రెస్ నాయకులు మూడుముంతల గంగరాజు యాదవ్, మద్ది వీరారెడ్డి, కాంగ్రెస్ నాయకులు కొర్ని సీతారాములు, ఏలూరి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.